దక్షిణ తెలంగాణలో కరువుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వేసవి రాకముందే దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

Update: 2024-03-08 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేసవి రాకముందే దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేసి ఉంటే నేడు రైతాంగం ఇంత ఇబ్బంది పడేవారా అని ప్రశ్నించారు. స్వరాష్ట్రం తెచ్చుకుందే నీళ్లకోసమని.. ఆ నీళ్లకు ఇప్పుడు గోస పడుతున్నామని ధ్వజమెత్తారు. అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుపేదలకు ఉండేందుకు ఇల్లు ఇవ్వలేదు కానీ, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రూ.కోట్లు తిన్నారని మండిపడ్డారు. రానున్న రెండేళ్లలో తెలంగాణలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News