బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు.

Update: 2024-10-06 12:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో TGPSC ఆధ్వర్యంలో 1473 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుల కలలను చిదిమేసిందని మండిపడ్డారు. ఎంతోమంది విద్యార్థుల బలిదానల మీద తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యోగుల జీవితాల్లో పండగ తీసుకురావడానికి దసరా పండగ కంటే ముందే వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 11 వేల ఉపాధ్యాయ కొలువుల నియామక పత్రాలను కూడా ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొలువులు పొందుతున్న వారు దానిని ఉద్యోగంగా కాకుండా.. ఉద్వేగంగా భావించాలని సూచించారు.

ఇంజనీర్లుగా నియమితులు అవుతున్న మీరు.. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ను కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా..? కాళేశ్వరంను కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసం హడావిడిగా కట్టారని, కానీ అది ఐదేళ్లు కూడా మిగలలేదని తెలిపారు. వందేళ్ల అభివృద్దిని పదేళ్ళలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు.   


Similar News