షాద్నగర్ బాధితురాలికి BRS ఆర్థికసాయం
పోలీసుల దాడిలో గాయపడిన మహిళకు బీఆర్ఎస్ నేతలు ఆర్థిక సాయం చేశారు. సోమవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలు ఆమెను పరామర్శించారు.
దిశ, వెబ్డెస్క్: పోలీసుల దాడిలో గాయపడిన మహిళకు బీఆర్ఎస్ నేతలు ఆర్థిక సాయం చేశారు. సోమవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలు ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏడు నెలలుగా రాష్ట్రానికి హోం మంత్రి లేడని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రోజు ఎక్కడో కూడా అఘాయిత్యం జరుగుతున్న వార్తలు చూస్తూనే ఉన్నామని అన్నారు. మహిళపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.