BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. హై కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్

తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై

Update: 2024-05-03 04:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ కేసులో ఉద్దేశపూర్వంగా బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తు్న్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్‌లో పేర్కొంది. బీఆర్ఎస్‌పై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గులాబీ పార్టీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు దర్యాప్తులో చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ కేసుపై లోతుగా విచారణ చేస్తుండగా.. తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గా్ల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Similar News