మేడిగడ్డ‌ బ్యారేజీపై కాంగ్రెస్ కుట్ర! ఆధారాలతో సహా బీఆర్ఎస్ ఆసక్తికర వీడియో ట్వీట్!

మేడిగడ్డ బ్యారేజీ పై కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది.

Update: 2024-03-03 09:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ పై కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. వీడియో లో కుంగిన పిల్లర్ల వద్ద వరద నీరు పారుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వద్దకు భారీగా వరద నీరు చేరుతున్నదని బీఆర్ఎస్ పేర్కొంది.

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో బ్యారేజీ వద్ద అధికారులు నామమాత్రంగా మరమ్మత్తు చర్యలు చేపట్టి వదిలేయగా.. ఇప్పుడు బ్యారేజీలోని 19, 20, 21 పిల్లర్ల వద్దకు వరద నీరు చేరుతుంది. కుంగిన పిల్లర్లను వరద నీటితో మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించింది. వరద నీటితో బురద రాజకీయం చేసి బీఆర్ఎస్‌ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది. మేడిగడ్డ పిల్లర్లకు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది.

Tags:    

Similar News