BREAKING: ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే : కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆరు గ్యారంటీల అమలుపై కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-07-16 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరు గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేశారు. మంగళవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలామంది కలెక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారని, తెలంగాణను సొంత రాష్ట్రాలుగా భావించి పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐఏఎస్‌లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా, సమర్ధవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందంటూ దిశానిర్దేశం చేశారు.

కేవలం ఏసీ గదులకు పరిమితం కావొద్దని క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, మేజర్ సర్కారు దవాఖానాలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రజావాణి సమస్యలను సాధ్యం అయినంత మేరకు పరిష్కరించాలని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమైన అంశమని తెలిపారు. ప్రతి నిరుపేద విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు దాదాపు రూ.85 వేలు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను గాడి తప్పుకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటేనే, ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో పాటు, సీఎస్, డీజీపీ, ప్రభుత్వ సలహాదారులు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News