BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

జోగులాంబ అమ్మవారి సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

Update: 2024-05-05 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ అమ్మవారి సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇవాళ అలంపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడతూ.. నల్లమల్ల అడవుల్లో పుట్టిన తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని ఎమోషనల్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమను దెబ్బ కొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే పాలమూరులో వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్‌లో మల్లు రవిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే పాలమూరు పౌరుషం ఏంటో ప్రత్యర్థులకు తెలుస్తోందని, ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పోయిన డిసెంబర్‌లో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ సెమీ ఫైనల్‌లో విజయం సాధించిందని, రాబోయే మే 13న తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ, గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోందని తెలిపారు. అందులో గుజరాత్‌‌ను చిత్తుగా ఓడించి తెలంగాణ గెలిపిద్దామని పిలుపునిచ్చారు.


Read More...

రేవంత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. సీఎంపై MP ధర్మపురి అర్వింద్ ఫైర్ 

Tags:    

Similar News