BREAKING: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట టెన్షన్.. టెన్షన్..! బీఆర్ఎస్ విద్యార్థి నేతల అరెస్టు

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలని, జాబ్‌ క్యాలెండర్‌, అదేవిధంగా గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంపు, జీవో 46 రద్దు, డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలనే అంశాలపై నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.

Update: 2024-07-05 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలని, జాబ్‌ క్యాలెండర్‌, అదేవిధంగా గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంపు, జీవో 46 రద్దు, డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలనే అంశాలపై నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ చేపడతామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది.

అయితే, ఆ మార్చ్‌ను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపడుతున్నారు. జిల్లాల నుంచి నిరుద్యోగులు హైదరాబాద్‌కు రాకుండా అదుపులోకి తీసుకున్నారు. ఇక టీజీపీఎస్సీ కార్యాలయం ఎదట బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు చేపట్టిన ఆందోళన అరెస్ట్‌కు దారి తీసింది. రహదారిపై బైఠాయించి నేతలను పోలీసులు చెదరగొట్టారు. అంతరం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్‌‌తో సహా ఆందోళనకారులను నిలువరించి అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.  


Similar News