డ్రగ్స్ వాడితే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. డీజీపీ హెచ్చరిక

హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ బార్ అండ్ లాంజ్‌లో శనివారం రాత్రి సైకెడెలిక్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.

Update: 2024-07-08 05:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ బార్ అండ్ లాంజ్‌లో శనివారం రాత్రి సైకెడెలిక్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు పబ్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్త ట్విట్టర్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను పబ్బులు, బార్లు, క్లబ్బులు ఏ మాత్రం ప్రోత్సహించినా అత్యంత కఠినమైన కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

ఆ ప్రాపర్టీస్ సీజ్ చేసి డ్రగ్స్ సరఫరా చేసిన వారు, వాడిన వారు సైతం జైలు ఊచలు లెక్కించాల్సిందేనని స్పష్టంచేశారు. డ్రగ్స్ వాడకం, సరఫరా పట్ల కఠినమైన చట్టాలు ప్రయోగించి వాటి నిరోధానికి తెలంగాణ పోలీసు విభాగం, ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణచివేయడం తమ మొట్టమొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Tags:    

Similar News