GOOD NEWS: మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు.

Update: 2024-07-08 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కారు కట్టుబడి ఉంది. ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు చేశారు. మరికొన్ని పథకాలు అమలు చేసే యోచనలో ఉంది. ఈ గ్యారంటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్కారు మహిళలకు మరో గుడ్‌న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళా సమాఖ్య, స్త్రీనిధి ద్వారా రుణం అందజేయనుందని ప్రకటించింది. జిల్లాల వారిగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని సెలక్ట్ చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మహిళలకు స్పెషల్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం త్వరలోనే అమలు కానుందని పలువురు తెలంగాణ మంత్రులు ఇటీవలే స్పష్టం చేశారు.


Similar News