సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Update: 2024-07-08 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరగా.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ చల్లా, సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ వచ్చింది. అలాగే మంగళవారం సీఎం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని.. అందుకోసమే ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు అనే దానిపై ఎమ్మెల్సీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Similar News