BREAKING: రేపే సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. ఎన్నికల వేళ టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ

అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-04-17 13:48 GMT

దిశ, వె‌బ్‌డెస్క్: అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని, అదేవిధంగా రాష్ట్రంలో కేసును టేక్అప్ చేసిన ఏసీబీ నుంచి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా‌ రెడ్డి 2017లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్రా విచారణలో వాయిదా వేయాలంటూ ధర్మసనాన్ని కోరారు. అయితే, రేపు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి మరోసారి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఓటుకు నోటు కేసు ఇలా..

కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ డబ్బు ముట్టజెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డబ్బు సంచులతో స్టీఫెన్‌సన్ ఇంటికి డబ్బు సంచులతో వెళ్లాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎంటరై.. ఓటుకు డబ్బు ఇవ్వజూపినట్లగా తమ దగ్గర ఆధారం ఉందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులోనూ ఫుటేజీలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు.

చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన ఓ ఆడియో కూడా విపరీంగా వైరల్ అయింది. దీంతో ఓటుకు నోటు కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ డబ్బు సంచులను చంద్రబాబే పంపించాడంటూ అప్పటి టీఆర్ఎస్, వైసీపీ నాయకులు టీడీపీపై దుమ్మెత్తిపోశారు. ఆ తరువాత కొన్నాళ్లకు విషయం సద్దుమణిగింది. ఈ కేసులో అప్పట్లో జైలు పాలైన అరెస్ట్ రేవంత్ రెడ్డి కూడా బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, 2017లో కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం‌కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు

ఇటీవలే ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టలు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News