BREAKING: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం కీలక సూచన

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-02-28 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 1,521 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది హాజరు కానున్నారు. అందులో ఫస్టియర్ విద్యార్థులు 4,78,718 మంది ఉండగా, సెకండియర్ విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. సెకండియర్ ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు.

పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇంటర్‌ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి పాఠశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారుజ పేపర్‌ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్ర పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ విద్యార్థులు చెయ్యెత్తిన చోట బస్సు ఆపి వారికి సహకరించాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోతే వారు పరీక్షను రాసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. అందుకే వారికి బస్సు ఆపి సహకరించాలని పేర్కొన్నారు.  

Tags:    

Similar News