BREAKING: డ్రగ్స్ అమ్మినా.. కొన్నా.. వాడినా దొరికిపోతారు : సందీప్ శాండిల్య స్వీట్ వార్నింగ్

డ్రగ్స్ అమ్మినా.. కొన్నా.. వాడినా దొరికిపోవడం పక్కా అని తెలంగాణ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-08-20 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ అమ్మినా.. కొన్నా.. వాడినా దొరికిపోవడం పక్కా అని తెలంగాణ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య 40 వేలకు చేరిందని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, క్యాంపస్‌లో డ్రగ్స్ వాడకం అధికంగా ఉందని అన్నారు. డబ్బున్న వాళ్లు కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకుంటున్నారని, సామాన్యులు గంజాయి మత్తులో చిత్తవుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కొకైన్ వాడకంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని, గంజాయి వినియోగంలో ఐదో స్థానంలో ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. పబ్‌లలో మొదలన కల్చర్ మెల్లిగా పల్లెల వరకు పాకిందని.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. డగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా.. వాడినా తమ నుంచి తప్పించుకోలేరని, ప్రపంచంలో అత్యుత్తమమైన టెక్నాలజీతో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కట్టడి చేస్తామంటూ సందీప్ శాండిల్య స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

Tags:    

Similar News