BREAKING : ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ సాధించగా మూడోసారి ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది.

Update: 2024-06-05 07:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా మూడోసారి ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 8న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 8న సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పక్షాలు హాజరుకానున్నాయి. కాగా, 2014, 2019, 2024 మూడు టర్ముల్లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1951, 1957, 1962 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ వరుస విజయాలు సాధించడంతో ఓటమి ఎరుగని నేతగా నెహ్రూ నిలిచారు. కాగా, ఈ జనరేషన్‌లో అరుదైన ఫీట్ సాధించిన ప్రధానిగా మోడీ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. అయితే నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో జరిగే ఈ భేటీలో లోక్ సభ రద్దుక నిర్ణయం తీసుకుంటారు. మోడీ నివాసంలో ఈ భేటీ జరగనుంది.


Similar News