BREAKING: అదానీ కోసమే పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

అదానీ కోసమే దేశంలో పెద్ద నోట్లను నరేంద్ర మోడీ రద్దు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-09 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: అదానీ కోసమే దేశంలో పెద్ద నోట్లను నరేంద్ర మోడీ రద్దు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బడుగు బలహీనవర్గాలు, పేదలందరికీ భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. రాజ్యాంగం ఏర్పాటు కాకముందే పేదలు, అట్టడుగువర్గాల వారికి హక్కు ఉండేవి కాదని, వారందరికీ రాజ్యాంగమే హక్కులను కల్పించిందని అన్నారు.

వాళ్లందరికీ అన్యాయం చేస్తూ.. నేడు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటోందని ప్రజలకు వివరించారు. ప్రధాని మోడీ పాలనలో ఆయన కొందరికే ప్రయోజనాలు అందించాలని చూస్తున్నారని ఆరోపించారు. మరో‌వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు నిర్మూలించేంకే బీజేపీ ప్రైవేటికరణకు ఆజ్యం పోస్తోందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా దళితులు, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ వ్యాప్తంగా కలగణనకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళ బ్యాంక్ ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున రూ.లక్ష జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క దెబ్బతో భారత్‌తో పాటు తెలంగానలోని పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అన్నారు.

దేశ వ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్ట్ 15 నాటికి ఉద్యోగల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ పాలనలో అదానీ, అబానీలకు మాత్రమే లాభం జరిగిందని ధ్వజమెత్తారు. అదానీ కోసమే నోట్ల రద్దు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటీశ్వరులకు రుణ మాఫీ చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News