BREAKING: కేసీఆర్, హరీష్ చెల్లని రూపాయిలాంటోళ్లు : సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో రూ.18 వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి రైతులకు చుక్కనీరు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈనాడు ప్రతిపక్ష నేతలు కూడా తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని అంటున్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ముందు ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు.
అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు అదే రకంగా ఉన్నాయని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని, ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎన్నడూ కలలోనైనా అనేకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయలో మాజీ మంత్రి కేసీఆర్, హరీష్‌రావు గతంలో అన్నీ బోగస్ మాటలే చెప్పారని ఫైర్ అయ్యారు. తమ దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని పదేళ్ల కాలంలో ఏ ప్రాజెక్టుకు డీపీఆర్‌లు ఇవ్వలేదని ఆక్షేపించారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయినా ఈ ప్రాంతంపై ఉన్న అక్కసుతోనే ప్రాజెక్ట్ పంపులను కూడా ఆన్ చేయలేదని తెలిపారు.
తాము నీళ్లు చల్లుకోలేదని.. ఆ గోదావరి తల్లే తమ మీద నీళ్లు చల్లిందని రేవంత్ హరీష్ రావుకు ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం తాము పడిన శ్రమను మాజీ మంత్రి హరీష్‌రావు చులకన చేసి మాట్లాడుతున్నారని.. అంత చిత్తశుద్ధే ఉంటే ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికను చేపడుతామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని.. కేసీఆర్, హరీష్‌రావు చెల్లని రూపాయి లాంటివారని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.