బ్రేకింగ్ : మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో IT దాడులు.. వెలుగులోకి సంచలన విషయాలు

టాలీవుడ్ దిగ్గజ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

Update: 2023-04-20 04:52 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై వరుసగా రెండో రోజు ఐటీ అధికారుల దాడులు కొనసాగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25లో ఉన్న సినిమా సంస్థలో గురువారం ఉదయం నుంచే తనిఖీలు చేపట్టారు. ఆయా సినిమాల నిర్మాణానికి పెట్టిన పెట్టుబడుల్లో నల్లధనం ఉన్నట్టుగా ఇప్పటికే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఐటీ అధికారులు ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఇటు తెలంగాణ హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యేతోపాటు ఆంధ్ర కు చెంది మైనింగ్ వ్యాపారంలో ఉన్న మరో ఎమ్మెల్యే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.

ఆయా సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్ల మీద రెండు వందల ఎకరాలకు పైగా భూములను కొన్నట్టుగా కూడా ఐటీ అధికారుల విచారణలో వెళ్లడయినట్టు తెలిసింది.ఈ వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలు ఐటీ అధికారుల చేతికి చిక్కినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఐటీ అధికారులు విచారణకు రావాలని మైత్రి మూవీ మేకర్స్ ప్రమోటర్లు రవిశంకర్, నవీన్ లను పిలిచినట్టు తెలిసింది. ఇప్పటివరకు తీసిన సినిమాలు ఎన్ని? పెట్టుబడులు ఎంత? వచ్చిన లాభాలు ఎన్ని? ఈ డబ్బును ఏం చేసారు? అన్న అంశాలపై వీరి నుంచి సమాచారాన్ని తీసుకోనున్నట్టు తెలియ వచ్చింది. ఇక, అమెరికా నుంచి 500 కోట్లకు పైగా నిధులను సేకరించినట్టు ఉన్న సమాచారం నేపథ్యంలో దీనిపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి : Breaking: వీరసింహారెడ్డికి షాక్.. 100 రోజుల ఫంక్షన్‌కు అనుమతి నిరాకణ

Tags:    

Similar News