BREAKING: మోడీ లేకపోతే దేశమే అస్తమిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో కమలనాథులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు.

Update: 2024-04-11 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో కమలనాథులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పార్టీలోని కీలక నేతలు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతన్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ నెల 19న సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ లేకపోతే దేశం అస్తమిస్తుందంటూ హాట్ కామెంట్ చేశారు. ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మత కల్లోలాలు, మోసాలు, కరువు, నీటి కష్టాలు ఉధృతమవుతాయని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగెస్ పార్టీ ఇక్కడి నుంచి రాహుల్‌కు ట్యాక్స్ కడుతున్నారంటూ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ముందు అబద్ధపు హామీలతో ఆ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు.   

Tags:    

Similar News