Breaking : నాపై ఆరోపణలు చేస్తే సహిస్తా.. రాహుల్‌గాంధీపై చేస్తే మాత్రం సహించను: ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి

తనపై ఆరోపణలు చేస్తే సహిస్తానేమో గానీ.. రాహుల్‌గాంధీపై చేస్తే సహించబోనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Update: 2024-05-10 17:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై ఆరోపణలు చేస్తే సహిస్తానేమో గానీ.. రాహుల్‌గాంధీపై చేస్తే సహించబోనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదారబాద్‌లోని తాజ్‌కృష్ణలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీపై నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ వచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలవడమే మోడీ వ్యూహమని ఆరోపించారు. రూ.లక్షలు ఖర్చు చేసిన బీజేపీ ఆర్భాటంగా సభలు నిర్వహిస్తోందని.. వాటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఖర్చుల మీద, బీజేపీ ఖర్చుల మీద కమిషన్ వేద్దామని సవాల్ విసిరారు.

అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.8 వేల కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి రూ.1,500 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వద్ద రైల్వే టికెట్లు బుకింగ్ చేసేందుకు కూడా డబ్బులు లేవని అన్నారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న నాడు కూడా రాజ్యాంగంలో మార్పు ప్రస్తావని వచ్చిందని, అప్పుడు మార్పు కోసం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో కమిటీ వేశారని గుర్తు చేశారు. అయితే, ఐదుగురు సభ్యుల కమిటీ అధ్యయనం చేసి నివేదకి ఇచ్చినా దానిని దాచి పెట్టాలని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన నాటి నుంచి వందేళ్లు వచ్చే సరికి రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆ సంస్థ సిద్ధాంతమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే అర్ఎస్ఎస్ అజెండాలోని అన్ని అంశాలను బీజేపీ అమలు చేస్తోందని అన్నారు. తాను లేవనెత్తిన అంశం వాస్తవం కాబట్టే నేడు తెలంగాణలో 300 మంది ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంశాక మోహరించిందని తెలిపారు.     

Tags:    

Similar News