Breaking : గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైపోయింది.

Update: 2024-08-07 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల చాల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు.ముఖ్యంగా గురుకులాల్లో పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. హాస్టలో తిండి సరిగా ఉండటం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని, కూరలు కూడా దారుణంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు.

తాజాగా.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత విద్యార్థులు కడుపునొప్పి , వాంతులతో ఇబ్బంది పడ్డారు. విద్యార్థులకు హాస్టలో అందిస్తున్న భోజనం ద్వారానే ఫుడ్ పాయిజన్ అయినట్టు పాఠశాల సిబ్బంది గుర్తించారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.


Similar News