BREAKING: అసదుద్దీన్‌తో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్ అయింది.. కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు (వీడియో వైరల్)
లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ స్టేట్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ స్టేట్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇప్పటి అభ్యర్థులను ప్రకటించి ఆయా పార్టీలు ప్రచారపర్వాన్ని కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల లోపు ఎవరు ఎవరితో దోస్తీ కడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన వాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన స్పందించారు. అసదుద్దీన్, కాంగ్రెస్ పార్టీకి మధ్య దోస్తీ ఫిక్స్ అయ్యిందని, హైదరాబాద్‌లో అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా తనకు, అసదుద్దీన్‌కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందని, కాకపోతే ఎంపీ ఎలెక్షన్లలో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్‌ఖాన్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఎవరు ఎవరితో దోస్తీ చేస్తున్నారో తెలియని అయోమయం అందరిలోనూ నెలకొంది.
కాగా, హైదరాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పవర్‌లో ఉన్న కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్ధిని ప్రకటించ లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక వేళ నాలుగు పార్టీ అభ్యర్థులు తలపడితే.. తన గెలుపు కష్టమేనని అసదుద్దీన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిడి తెస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఒకే వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే.. ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని ఎంఐఎం చీఫ్ భావిస్తున్నారు. ఇటివలే ఆయన హస్తం పార్టీలోని ముస్లిం నాయకుడి భేటీ అయి సీఎం రేవంత్ రెడ్డితో రాయబారం నడిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజా పొలిటికల్ స్ట్రాటజీలతో రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎంకు మధ్య సయోధ్య కుదిరిందా.. అన్న అనుమానాలు బలపడుతున్నాయి.