బ్రేకింగ్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవితను ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది.