Boycott Teacher's Day: ‘ఇలాంటి వారి వల్లే సీఎంకు, నాలాంటి వారికి చదువు రాకుండా పోయింది’: విశారదన్ మహరాజ్

సర్వేపల్లి రాధాకృష్ణన్ పై విశారదన్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-05 08:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులుతో పాటు శూద్రులంతా బహిష్కరించి, ఖండించాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా. విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. అగ్రవర్ణ పాలక వర్గాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పోస్టు చేసిన విశారదన్.. సర్వేపల్లి రాధాకృష్ణ శూద్రులకు విద్యను నిరాకరించే చాతుర్వర్ణ మనువాద సిద్ధాంతాన్ని సమర్థించారని, ఈ దేశంలో దాన్ని అమలు చేయాలని తన ఇండియన్ ఫిలాసఫీ గ్రంథంలో రచించారని అన్నారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఇలాంటి వారి అభిప్రాయాల వల్లే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాలాంటి వారందరికీ చదువు సంపూర్ణంగా రాకుండా పోయిందనిన్నారు. ఈ సందర్భంగా గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మధ్య హిందీ భాషా పరిజ్ఞానం విషయంలో జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోను అటాచ్ చేశారు. 


Similar News