‘‘గ్రీన్ ఇండియా’’ ఛాలెంజ్‌లో సింగర్ శ్రేయా ఘోషల్.. MP సంతోష్‌తో కలిసి సందడి
సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ అన్నారు. గాయకుడు శంకర్ మహదేవన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి పైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పర్యావరణం పరిరక్షణకు మొక్కలు నాటడం, పెరిగేలా చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. మొక్కల పెంపు గొప్ప సామాజిక బాధ్యతమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తాను కూడా ముగ్గురికి నామినేట్ చేసినట్లు శ్రేయా ఘోషల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి : ‘ఏజెంట్’ ఫెయిల్యూర్.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత