కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ నిర్ణయం.. నేడే కీలక ప్రకటన చేసే ఛాన్స్!

పథకాలు, హామీల అమలు వంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ(BJP) భావిస్తున్నది. ఇటీవల బీజేఎల్పీ(BJLP) కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

Update: 2024-09-24 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పథకాలు, హామీల అమలు వంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ(BJP) భావిస్తున్నది. ఇటీవల బీజేఎల్పీ(BJLP) కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రుణమాఫీ అవ్వని రైతుల పక్షాన పోరాటం చేయాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్ణయించారు రైతు భరోసా, రైతు బీమా వంటి అంశాలు, ఇతర హామీలపైనా పోరాడాలని డిసైడ్ అయ్యారు. ముందుగా సెప్టెంబర్ 20న ఇందిరా పార్క్ వద్ద రైతుదీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండడంతో రైతుదీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.

మెంబర్ షిప్ డ్రైవ్ తర్వాతే రైతు దీక్ష చేయాలని స్పష్టం చేశారు. దీంతో మంగళవారం దీక్ష తేదీ, వేదికను మంగళవారం అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముంది. కాగా, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాసమస్యలపై పోరాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి ఆధ్వర్యంలో రైతుదీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. జమ్మూకశ్మీర్ ఎన్నికల బిజీలో ఉండటంతో ఇక్కడి నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశాయి. దీంతో దీక్ష ఆలస్యమైనట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు రైతుదీక్షకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నిర్వహణపై పార్టీ నేతలు దృష్టి సారించారు.


Similar News