BJP's counter to Owaisi: మహారాష్ట్ర రాజకీయాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల దుమారం.. టీ బీజేపీ కౌంటర్

అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారంగా మారాయి.

Update: 2024-11-07 12:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసులు హెచ్చరించినా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) తీరు మారలేదని సెక్యులరిజం ముసుగులో ఆయన అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది. అసదుద్దీన్ (Asaduddin Owaisi).. నీ తమ్ముడికి మీరు నేర్పిన సెక్యులరిజం ఇదేనా అంటూ ప్రశ్నించింది. గతంలో అక్బరుద్దీన్ చేసిన '15 నిమిషాల' వ్యాఖ్యలు (15 Minutes Comments) తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా 15 నిమిషాలు అని కోడ్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహా పాలిటిక్స్ లో రచ్చగా మారాయి. దీంతో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీ బీజేపీ (Telangana BJP) గురువారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తింది. నాడు మారలేదు.. నేటికీ బుద్ధిరాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఇటీవల మహారాష్ట్ర  ఎన్నికల (Maharashtra Elections)  ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. ఇప్పుడు టైమ్ 9:45 అవుతున్నదని ప్రచారం రాత్రి 10 గంటల వరకు చేసుకోవచ్చఅని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇంకా 15 నిమిషాలు మిగిలి ఉందని పదే పదే చెప్పారు. ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అక్భరుద్దీన్ వ్యాఖ్యలు కుక్కతోక వంకర అన్న చందంగా ఉన్నాయని మండిపడింది.

నవనీత్ కౌర్ కౌంటర్:

అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ కౌర్ (Navneet Kaur) కౌంటర్ ఇచ్చారు. చోటా ఓవైసీ హైదరాబాద్ నుంచి మాకు చెబుతున్నావ్.. మీ గడియారంలో పది కావడానికి ఇంకా 15 నిమిషాలు ఉందేమో కానీ నా గడియారంలో ఇంకా 5 సెకండ్లు మాత్రమే ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. మీకు 15 నిమిషాలు పడుతుందేమో కానీ మాకు కేవలం 5 సెకండ్లు మాత్రమే చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి వర్సెస్ మహా వికాస్ అఘాడి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చగా మారాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News