BJP: మీ గ్యారంటీలకు 10 వేల రోజులు కూడా తక్కువే.. సీఎంకు బండి సంజయ్ కౌంటర్
మీ గ్యారంటీల(Guarantees) అమలుకు 10 వేల రోజులు(Ten Thousand Days) కూడా సరిపోవని, అబద్ధపు హామీలతో తెలంగాణ(Telangana) ప్రజలను మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ట్వీట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మీ గ్యారంటీల(Guarantees) అమలుకు 10 వేల రోజులు(Ten Thousand Days) కూడా సరిపోవని, అబద్ధపు హామీలతో తెలంగాణ(Telangana) ప్రజలను మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ(PM Modi) చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కౌంటర్(Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డి.. మీ గ్యారంటీలకు షరతులు(Terms And Conditions) వర్తిస్తాయని తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదని, ఆరు హామీలు(Six Garantees) నెరవేర్చడానికి వంద రోజులు(100 Days) కాదు. పదివేల రోజులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు.
మీ అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని, కేసీఆర్(KCRBRS) కొత్తగా పుట్టిన బిడ్డపై రూ.1లక్ష అప్పు వేసినట్లే మీరు కూడా ప్రతి తెలంగాణ వ్యక్తిపై రూ.2.5 లక్షల అప్పులు చేస్తారని తెలిపారు. రుణమాఫీ(Runamafi) పేరుతో రైతులను మోసం చేశారని, రైతు భరోసా(Raithu Bharosa), రూ.500 పాడీ బోనస్(Padi Bonus) బోగస్ అయ్యాయని విమర్శలు చేశారు. రూ.500 గ్యాస్(Gas) సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Power)లో అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారని చెప్పారు.మూసీ ప్రాజెక్ట్(Moosi Project) కోసం మీ వద్ద రూ.1.5 లక్షల కోట్లు ఉన్నాయి కానీ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి డబ్బు లేదని, కాళేశ్వరం(Kaleshwaram) తరహాలో మరో ఏటీఎం(ATM)గా మూసీ రూపుదిద్దుకోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని ప్రధాని ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద మేం ఇళ్లు నిర్మిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పేదల ఇళ్లను కూలుస్తోందని అన్నారు.
హాస్టళ్లలో నాసిరకం ఆహారంపై విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యార్థులు నిరసనలు ప్రారంభించారని తెలిపారు. అలాగే అసెంబ్లీలో, ఎన్నికల ముందు విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్(Job calender) పెద్ద జోక్ అని దుయ్యబట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ విఫలమైందని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం పక్కన పెడితే.. మునుపెన్నడూ లేని విధంగా విధ్వంసం చేసి అంధకారంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. మీరు 6 హామీలను అమలు చేశారని నిజంగా విశ్వసిస్తే.. పాదయాత్రలో పాల్గొనాలని, ప్రజల కోసం వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.