BJP Vs INC: దాడిని ఖండించిన బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్

కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar) ప్రశ్నించారు.

Update: 2025-01-07 11:04 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar) ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయం మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు ఖండించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అద్దంకి దయాకర్.. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ కార్యాలయం(BJP Office) మీద దాడిని బీజేపీ నేతలు(BJP Leaders) చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, మహిళలపై, ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై సామాజిక దాడి చేసిన రమేష్ బిథుర్(Ramesh Bithur) పై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు.

ఆయనను చెప్పుతో కొట్టాల్సింది పోయి, ఆఫీస్ లపై దాడి చేస్తున్నారని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. మహిళల పట్ల, మహిళా సమాజం పట్ల బీజేపీ ప్రజా ప్రతినిధులకు ఉన్న గౌరవం ఎలాంటిదో బీజేపీ నేత రమేష్ ను చూస్తే అర్థం అవుతుందన్నారు. బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, మహిళలను కించపరిస్తే వారిపై ఎలాంటి చర్యలైన తీసుకోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కుతారని, మరి రమేష్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారని, ముందు మహిళలను కించపరిచిన వాడిని అరెస్ట్ చేయాలని మండిపడ్డారు. బీజేపీ నేతలకు మహిళలపట్ల ఉన్న అంకిత భావం ఇదేనా అని, మహిళల పట్ల బీజేపీ అనుసరిస్తున్న విధానం ఇదేనా అని అద్దంకి నిలదీశారు.

Tags:    

Similar News