నేతలను సప్లై చేసే దుకాణం కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే నేతలను ఇతర పార్టీలకు సప్లై చేసే పార్టీ అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమకు నిలయం కాదని లీడర్లను అమ్ముకునే పార్టీ అని విమర్శలు గుప్పించారు.
2014లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. 1/3 వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పంపించిదని అన్నారు. అలాగే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2/3 వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీలో చేరారని అన్నారు. ఇక ఈ సారి తనకు ఎమ్మెల్యేల అవసరం ఉంటే ఎంత డబ్బైనా వెచ్చించి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
These jokers who are fighting on stage infront of Rahul Gandhi, are asking people to join Congress and want to run government in Telangana…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 2, 2023
Congress is Dukaan but not of Mohabbat. It is Dukaan to supply leaders to BRS.
In first term - 1/3 of Congress MLAs joined BRS
In… pic.twitter.com/4eoSKhtbSQ