ప్రీతి శవానికి 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు.. బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-06 10:06 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన ప్రీతి శవానికి నిమ్స్ లో 4 రోజుల పాటు చికిత్స అందించారని ఆరోపించారు. వరంగల్ లోనే ప్రీతి చనిపోయిందని, చనిపోయిన ఆమె శవానికి నిమ్స్ లో వైద్యం అందించి డ్రామాలాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరగుతోన్న అఘాయిత్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒకరోజు బీజేపీ నిరసన దీక్షను చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ.. మెడికో ప్రీతిది ఆత్మహత్య కానేకాదని.. ముమ్మాటికి ఆమెది హత్యేనని అన్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా ప్రీతి ఎలాంటి ఇంజక్షన్ తీసుకోలేదని రిపోర్టు వచ్చిందని గుర్తు చేశారు. ప్రీతి బ్లడ్ తీసేసి రిపోర్టును తారుమారు చేశారని అన్నారు.రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతోంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. 

Tags:    

Similar News