MLC Kavitha : బీసీ డిక్లరేషన్ పై బీజేపీకి మౌనమెందుకో : ఎమ్మెల్సీ కవిత
బీసీల కులగణన(BC Caste Census)పై బీజేపీ(BJP) పార్టీ వైఖరి చెప్పాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : బీసీల కులగణన(BC Caste Census)పై బీజేపీ(BJP) పార్టీ వైఖరి చెప్పాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. వరుసగా వివిధ కుల సంఘాలతో భేటీ అవుతున్న కవిత గురువారం శాలివాహన, ఆరెకటిక సంఘం నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీకి లెక్క లేదా? అని విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో బీసీలు, కుల వృత్తిదారుల అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ పథకాలను కవిత గుర్తు చేశారు. అటువంటి పథకాలన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. బీసీ కులగణన పూర్తయ్యిందంటుున్న ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతిలు నిరంతర పోరాటాలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.