BJP: కాంగ్రెస్ మేనిఫెస్టోను ఫాలో అవ్వడం లేదు.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

కాంగ్రెస్(Congress) తన మేనిఫెస్టో(Menifesto)ను ఫాలో అవ్వడం లేదని, సర్పంచు(Panchayithi Presidents)లు నిరసనలు(Protests) తెలుపుతున్న పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు.

Update: 2024-11-06 08:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్(Congress) తన మేనిఫెస్టో(Menifesto)ను ఫాలో అవ్వడం లేదని, సర్పంచు(Panchayithi Presidents)లు నిరసనలు(Protests) తెలుపుతున్న పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. పెండింగ్ బిల్లులు(Pending Bills) విడుదల చేయాలని రాష్ట్రంలోని మాజీ సర్పంచులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం, స్థానిక సంస్థల యొక్క మూడంచెల వ్యవస్థకు బాధ్యతలు, నిధులు మరియు స్థానిక అభివృద్ధి పనుల నిర్వహణను అప్పగించడం ద్వారా వాటి గత వైభవంతో పునరుజ్జీవింపబడుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ సర్పంచ్‌లు నిరసనలు తెలుపుతున్నా స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి ఆరోపణలు చేశారు. 

Tags:    

Similar News