17 స్థానాల్లో గెలుపు గుర్రాలని నిలబెట్టబోతున్నాం: MP

చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు.

Update: 2024-02-24 16:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ అక్రమాలపై మాట్లాడిన సీఎం రేవంత్.. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ధరణిపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడెందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు.

అవినీతి దొంగలను దోచుకున్నది కక్కించే వరకు వదిలిపెట్టబోమన్న రేవంత్ రెడ్డి ఆ విషయాలపై ఎందుకు నీరుగార్చారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. 17 లోక్ సభ స్థానాల్లో గెలిచే గుర్రాలని నిలబెట్టబోతున్నట్లు ఆయన చెప్పారు. మోడీ చరిష్మాతో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News