One Nation-One Election : వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
'వన్ నేషన్-వన్ ఎలక్షన్'(One Nation-One Election) పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(BJP MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : 'వన్ నేషన్-వన్ ఎలక్షన్'(One Nation-One Election) పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(BJP MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పేరుతో దేశ అభివృద్దికి ఆటంకం కావొద్దని కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై ఆయన మండి పడ్డారు. దేశ సంపదను ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీదని, మరి దేశ జనాభాలో 80% ఉన్న హిందువుల సంగతి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశ సంపదకు ఈ దేశంలోని ప్రతి పౌరుడు అర్హుడు అన్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలోపు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతోపాటు, జాతీయ అధ్యక్షుని ఎంపిక కూడా పూర్తి అవుతుందని ఎంపీ వెల్లడించారు.