DK Aruna: లగచర్ల ఘటనపై డీకే అరుణ సీరియస్.. ప్రజలు మెచ్చని ప్రాజెక్ట్ పై సీఎం కు ఎందుకంత ప్రేమ?

లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.

Update: 2024-11-13 05:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagcharla Incident)గ్రామంలో రెండ్రోజుల క్రితం కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. ఫార్మా కంపెనీ (Pharma Company) ఏర్పాటును నిరసిస్తూ.. గ్రామస్తులు అక్కడికెళ్లిన అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో కోర్టు 16 మందికి రిమాండ్ విధించగా.. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. లగచర్ల దాడి ఘటన.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చురేపింది.

ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని బీఆర్ఎస్(BRS) నేతలు మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యురాలు డీకే అరుణ సైతం లగచర్ల ఘటనపై స్పందించారు. లగచర్ల ఘటనలో కుట్రకోణం ఉన్నట్లు కనిపించడం లేదన్నారామె. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. లగచర్ల ఘటనలో కుట్రకోణం ఉంటే.. ఇంటెలిజెన్స్ ఏం చేస్తేందని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు కలెక్టర్ కు భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటన జరిగినపుడు అక్కడ అన్నిపార్టీల కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు డీకే అరుణ. ఫార్మా ప్రాజెక్టుపై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని తెలిసి కూడా.. సీఎం రేవంత్ (CM Revanth)కు ఎందుకు ఆ ప్రాజెక్ట్ పై అంత ప్రేమ అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News