రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు కేసీఆర్ కుట్ర.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

బీజేపీ ఎంపీ ధర్మపురి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రవేటీకరణకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు.

Update: 2023-07-16 10:43 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ ధర్మపురి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రవేటీకరణకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా దాదాపు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేసి ఆయన.. నేడు కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల ఆర్టీసీని కేసీఆబీజేపీ ఎంపీ ధర్మపురి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రవేటీకరణకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని బలహీన పర్చేందుకు బీఆఎస్ నేతలు ఆర్టీసీ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు.

అదేవిధంగా ఆర్టీసీకి బాగా లాభాలు వచ్చే రూట్లల్లో ప్రైవేట్ ట్రావెల్స్ కు అనుమతులిస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన వేల కోట్ల పీఎఫ్, ఇతర ఫండ్స్ మాయమయ్యాయని, వాటిని ఎలా ఖర్చు చేశారో కూడా ప్రభుత్వం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఆర్టీసీలో ఎలాంటి నియామకాలు జరగడం లేదని, కొత్త రూట్లు వేయడం లేదని, అలాగే కొత్త బస్సులను కూడా కొనుగోలు చేయడం లేదని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. బిర్యానీ పెట్టి మరీ కార్మికులను, ప్రయాణికులను కేసీఆర్ గోస పెడుతున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలను మానుకోవాలని, ఆర్టీసీ కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News