అలా చేస్తే బిచ్చమెత్తుకున్నట్లే.. మహిళల ఫ్రీ జర్నీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు (వీడియో)

ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.

Update: 2024-01-11 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇదే అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేలు ఆదాయం ఉన్నా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటే మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వాళ్లని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆదాయం, ఆస్తులు భారీగా ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్న వాళ్లంతా బిచ్చగాళ్లే అన్నారు. ప్రస్తుతం ఫ్రీ బస్సు సౌకర్యం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Similar News