Rakesh Reddy: కవిత జైలు నుంచి రావాలని కోరుకుంటున్నా.. మనసులో మాట బయటపెట్టిన BJP ఎమ్మెల్యే

కవిత లిక్కర్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని, కానీ, నిజామాబాద్ ఆడబిడ్డ కవిత జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నానని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-27 14:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కవిత లిక్కర్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని, కానీ, నిజామాబాద్ ఆడబిడ్డ కవిత జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నానని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్‌కు మంత్రసాని పని కూడా సరిగ్గా చేతకాలేదని ఎద్దేవా చేశారు. అందుకే తల్లిని చంపి బిడ్డను ఇచ్చామంటూ పదే పదే చెబున్నారని సెటైర్లు వేశారు.

వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీ మూడు కాన్పులు(మూడు రాష్ట్రాల ఏర్పాటు) విజయవంతంగా చేసిందని కొనియాడారు. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపులకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకమని రాకేశ్ రెడ్డి తెలిపారు. తాను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యభిచారులే పార్టీ మారుతారని, తనకు రాజకీయాలపై అంత ఆసక్తి లేదన్నారు. పార్టీ కోసం పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని వివరించారు. ఇదిలా ఉండగా తెలంగాణకు హోంమంత్రి కావడమే తన లక్ష్యమని పైడి రాకేశ్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

Tags:    

Similar News