గృహ లక్ష్మి పథకం ఓట్ల కోసమే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
గృహ లక్ష్మి పథకం కేవలం ఓట్ల కోసమే తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు.
దిశ, వెబ్ డెస్క్: గృహ లక్ష్మి పథకం కేవలం ఓట్ల కోసమే తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు. గృహలక్ష్మి పథకం కింద పేదలకు రూ.5 లక్షలు ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. "పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని" భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పేర్లతో సీఎం కేసీఆర్ పేద ప్రజలతో ఆడుకున్నారని అన్నారు. ఇప్పటి వరకు రూ.20 లక్షల బడ్జెట్ పెట్టిన కేసీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించింది రూ.600 కోట్లు మాత్రమేనని అన్నారు.
తొమ్మిదేళ్ల కాలంలో 2.9 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిన కేసీఆర్.. కట్టించింది 35 వేలు మాత్రమేనని అన్నారు. కట్టిన ఇండ్లు పాడుపడి పోతున్నాయి తప్ప వాటిని ఇవ్వడం లేదని, అసలు వాటిని పంచే దమ్ము కేసీఆర్ కు లేదని అన్నారు.డబుల్ బెడ్ రూం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హడ్కో 9 వేల కోట్లు అప్పు ఇచ్చిందని, రూరల్ అర్బన్ మిషన్ కిందరూ. 1311 కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఇక తాజాగా గృహలక్ష్మి పథకం పేరుతో సీఎం కేసీఆర్ మరో డ్రామాకు తెర తీశారని, ప్రకటనలు పేపర్ల వరకే తప్ప అమలుకు నోచుకోదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటి నిర్మాణం కోసం పేదలకు రూ.5.04 లక్షలు ఇస్తామని చెప్పారు.
ఇందిరా పార్క్ :
— Eatala Rajender (@Eatala_Rajender) August 12, 2023
"పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని" భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ ధర్నా చౌక్ సమస్యలకు పరిష్కారం చూపే… pic.twitter.com/HIQe3ssZrr