రైతుల వద్దకు బీజేపీ.. ఉమ్మడి జిల్లాల వారీగా నేతల విజిట్
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలిసేందుకు బీజేపీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల సంబంధించిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. కూరగాయలు, పండ్ల తోటలు సైతం దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతన్నలకు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయి మొలకలొచ్చాయి. పంట నష్టపోయిన వారికి రూ.10 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను రైతుల వద్దకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాల వారీగా నేతలు విజిట్ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పర్యటించే నేతల జాబితాను ప్రకటించారు. ఇద్దరు చొప్పున నేతలు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
ఉమ్మడి జిల్లా పేరు పర్యటించే నాయకులు
మెదక్: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
నిజామాబాద్: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎంపీ అర్వింద్
ఆదిలాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు
రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్
నల్లగొండ: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి
వరంగల్: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యుడు విజయరామారావు
ఖమ్మం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
కరీంనగర్: మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు