ఎమ్మెల్సీ టికెట్ నాకు ఇవ్వండి.. కిషన్ రెడ్డికి బీజేపీ నేత రిక్వెస్ట్

పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ తనకు వచ్చేలా చూడాలని బీజేపీ

Update: 2024-05-02 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ తనకు వచ్చేలా చూడాలని బీజేపీ నేత, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కొత్త సోల్కర్ రెడ్డి.. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాను 2021లో పార్టీలో చేరానని, రాష్ట్ర నాయకత్వం కూడా తనకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో తాను బీజేపీ తరుపున పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డికి వివరించారు. ఈ మేరకు తనకు బీఫాం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సోల్కర్ రెడ్డి ఉస్మానియాలో ఎంసీఏ విద్యనభ్యసించారు. ఈయన 2009, 2014 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..