BREAKING: టీ-బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ MP జితేందర్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల వేళ టీ-బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు.

Update: 2024-03-15 16:26 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ టీ-బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన రాజీనామా లేఖ రాశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన జితేందర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఇతరుల సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జితేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణలో వరుస చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి.. జితేందర్ రెడ్డి రివర్స్ షాక్ ఇచ్చారు. కాగా, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ టికెట్ ఆశించారు.

కానీ బీజేపీ హైకమాండ్ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణకు కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. వంశీ  చందర్ రెడ్డి మహబూబ్ నగర్  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీంతో జితేందర్ రెడ్డి పోటీపై ఉత్కంఠ నెలకొంది. అయితే, కాంగ్రెస్ మంచి పదవి ఆఫర్ చేయడంతోనే జితేందర్ రెడ్డి ఆ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, పరిణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు జితేందర్ రెడ్డి, ఆయన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..