తెలంగాణ గురుకులాల్లో పురుగుల అన్నం: డీకే అరుణ

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం పురుగుల అన్నం తింటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

Update: 2023-02-23 10:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం పురుగుల అన్నం తింటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ లోకమంతా ఏవీఎన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేయేనని ఆమె స్పష్టం చేశారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అండగా నిలవాలని ఆమె కోరారు. ఏవీఎన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తీసిన ర్యాలీలో డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పాల్గొన్నారు.

Tags:    

Similar News