BJP: రైతులకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలి.. రాణి రుద్రమ డిమాండ్
రైతులను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) క్షమాపణలు(Sorry) చెప్పాలని బీజేపీ స్పోక్స్ పర్సన్(BJP Spokes Person) రాణి రుద్రమ(Rani Rudrama Reddy) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రైతులను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) క్షమాపణలు(Sorry) చెప్పాలని బీజేపీ స్పోక్స్ పర్సన్(BJP Spokes Person) రాణి రుద్రమ(Rani Rudrama Reddy) అన్నారు. బీజేపీ కార్యాలయం(BJP Office)లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్(Mahaboob Nagar) లో రైతు విజయోత్సవాల పేరుతో మూడు రోజుల పాటు కొత్త తరహా వేడుకలు జరుపుతున్నదని, ఏం చేయకుండానే ఎందుకు ఉత్సవాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
రైతులను మోసం చేసినందుకు మోసాల ఉత్సవాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మద్దతు ధరకు అమ్ముడుపోక కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గున్నా.. ఏ రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చారో.. అదే రాహుల్ గాంధీని మరోసారి తీసుకొచ్చి రైతులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ను మోసాల డిక్లరేషన్ గా ప్రకటించి, లెంపలు వేసుకొని రైతులకు క్షమాపణలు చెప్పాలని రాణి రుద్రమ సంచలన వ్యాఖ్యలు చేశారు.