లోక్ సభలో ‘జై పాలస్తీనా’ స్లోగన్.. ఓవైసీపై అధికార పక్షం ఆగ్రహం
లోక్ సభలో ఓవైసీ ప్రమాణ స్వీకారం గందరగోళానికి దారి తీసింది.
దిశ, డైనమిక్ బ్యూరో : అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. ప్రమాణం చివర్లో అసదుద్దీన్ ఒవైసీ ‘జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పార్లమెంట్‌లో జై పాలస్తీనా అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ సభ్యులకు సర్ది చెప్పినా అధికార పక్షం సభ్యులు ఆందోళన కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో నినాదాల మధ్యే ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.