మెడికో ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి హోంమంత్రి మహమూద్ అలీ పేరు!

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2023-02-23 14:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న ప్రీతి అనే యువతి ఆత్మహత్యయత్నం కేసులో బాధితురాలి తండ్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేసులో హోం మినిస్టర్ బంధువు ఉన్నాడనే కారణంతోనే ప్రీతి కేసును తారుమారు చేస్తున్నారని ఆమె తండ్రి నాగేందర్, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు విషయంలో అధికారులు సరైన రీతిలో స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు కీలక ఎవిడెన్స్‌లు సేకరించినట్లు తెలుస్తోంది.

కొంత కాలంగా సీనియర్ సైఫ్ అనే వ్యక్తి వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సైఫ్‌ను వరంగల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేను నమోదు చేశారు. సైఫ్ నుంచి వాట్సాప్‌లో వేధింపులు రోజు రోజుకు పెరిగిపోవడంతోనే ఆమె ఈ డేంజర్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో హోంమంత్రి బంధువు ఉన్నాడనే అందుల్లే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో హోంమంత్రి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

గతేడాది సంచలనం సృష్టించిన జూబ్లీహీల్స్ మైనర్ పై అత్యాచారం కేసులో హోం మంత్రి మనువడి పేరు వినిపించింది. తాజాగా ఇదే నెలలో వెలుగు చూసిన భూత వైద్యం పేరుతో అమాయక యువతులకు వల వేస్తున్న బాబా హఫీజ్ పాషా కేసులోనూ హోం మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. బాబా హఫీజ్ పాషా కు హోం మంత్రి అండదండలు ఉన్నాయని కొన్ని వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. హోం మంత్రి పేరు వరుసగా వివాదాస్పదం అవుతుండటం ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News