లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. చరిత్రలో తొలిసారి..

లోక్ సభ స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2024-06-25 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోటీకి విపక్ష కూటమి సిద్ధమైంది. విపక్షాల తరఫున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేశారు. తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అయితే గతంలో అధికార పక్షానికి స్పీకర్ ఉండగా.. ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. యూపీఏ-1, యూపీఏ-2 ఇదే విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. యూపీఏ-1 హయాంలో బీజేపీ ఎంపీ చరణ్‌జీత్ సింగ్, యూపీఏ-2 లో బీజేపీ ఎంపీ కరియా ముండా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు.

కానీ గత పదేళ్లలో ఎన్డీయే తొలి టర్మ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా మిత్ర ప్రతిపక్షానికి కాషాయ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. రెండో టర్మ్‌లో ఆ పోస్ట్‌ను ఖాళీగానే ఉంచింది. తాజాగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ నామినేషన్ వేయడంతో తదుపరి ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. మరో వైపు స్పీకర్ పదవిపై ప్రతిపక్ష నేతలతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ఏకాభిప్రాయం కోసం రాజ్ నాథ్ మంతనాలు కొనసాగిస్తున్నారు.   


Similar News