జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ‌కి బిగ్ షాక్! మంత్రి సమక్షంలో..

సార్వత్రిక ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Update: 2023-10-18 07:48 GMT

దిశ, ఝరా సంగం: సార్వత్రిక ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఝరాసంగం జడ్పీటీసీ సభ్యులు వినీల నరేష్ హైదరాబాద్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్‌లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందని ఇకపై కూడా జహీరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందన్నారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పిన చెప్పని హామీలు అన్ని నెరవేర్చి తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకుందామన్నారు. బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి వల్ల బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు జడ్పీటీసీ వినీల నరేష్ తెలిపారు. అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఝరా సంగం మండల అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నామా రవి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..