బ్రేకింగ్: ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ అధికార ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలింది. ఈ సారి ఖమ్మం నుండి బీఆర్ఎస్ తరుఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ బరిలోకి దిగుతున్నారు.

Update: 2023-11-14 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్, ఖమ్మం సిటీ: అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలింది. ఈ సారి ఖమ్మం నుండి బీఆర్ఎస్ తరుఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ కీలక నేతలు పోటీ పడుతుండటంతో ఖమ్మం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు తగ్గట్లుగానే తుమ్మల, పువ్వాడ ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తు్న్నారు. గెలుపు లక్ష్యంగా నిత్యం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలింది. ఖమ్మం డిప్యూటీ మేయర్ దంపతులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ముక్తార్ దంపతులు బీఆర్ఎస్‌కు ఇవాళ రాజీనామా చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేటర్లను బీఆర్ఎస్ నేతలు బూతులు తిడుతున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలన చూసి విసిగిపోయి.. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. 

Tags:    

Similar News